సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (16:01 IST)

రష్మీ గౌతమ్ విడాకులు తీసుకుందా..? సమంతలా స్వేచ్ఛా పక్షి!

తెలుగు బుల్లితెర నుంచి వెండితెర వరకు తళుక్కున మెరిసిన రష్మీ గౌతమ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్టేట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా రష్మీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అఫీషియల్‌గా బయటకు వచ్చింది. రష్మీకి ఇటీవలే విడాకులు మంజూరు అయ్యాయి. 
 
ఒడిశా నేపథ్యం ఉన్న రష్మీ బుల్లితెరపై సెటిల్ అయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటోంది. పలు వ్యాపార సంస్థలకు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టింది.
 
ఇక రష్మీకి ఈ క్రేజ్ రావడానికి ముందే నేవీలో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్తతో ఎక్కడో తేడా కొట్టింది. వాళ్లిద్దరు కలుసుకున్న సందర్భాలూ తక్కువే. మొత్తానికి ఇటీవలే విడాకులు తీసేసుకుంది.
 
ఇప్పుడు ఆమె కూడా సమంతలాగా ఓ స్వేచ్ఛా పక్షి. అయితే ఇటీవలే ఆమె మరో వ్యక్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. అవన్నీ అబద్ధం. అయితే తనకు సుడిగాలి సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉందన్నది వాస్తవం. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం వాళ్లిద్దరు అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట.