సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (12:18 IST)

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో జాన్వీ కపూర్

jhanvi kapoor
ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాలతో చేయనున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్‌ను తీసుకుందామని చూశారుగానీ కుదరలేదు. అయితే ఎన్టీఆర్ 31వ సినిమాకి జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొణెను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో.. వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటం వలన, జాన్వీని సంప్రదించడం జరిగింది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. నవంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.