శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (10:22 IST)

ప్రభాస్‌తో చిన్నగొడవ ఉంది.. అందుకే మాట్లాడటం లేదు : 'ఏక్ నిరంజన్' హీరోయిన్

హీరో ప్రభాస్‌తో చిన్న గొడవ ఉందని, అందుకే అతనితో మాట్లాడటం మానేశానని ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. అయితే, బాహుబలి చిత్రంలో ప్రభాస్ నటన చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్

హీరో ప్రభాస్‌తో చిన్న గొడవ ఉందని, అందుకే అతనితో మాట్లాడటం మానేశానని ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. అయితే, బాహుబలి చిత్రంలో ప్రభాస్ నటన చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పుకొచ్చింది. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' చిత్రం భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అలాగే కంగనా రనౌత్ కూడా చూసి తన స్పందనను తెలియజేసింది. 
 
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఏక్ నిరంజన్' సినిమాలో నటించేటపుడు చిన్న గొడవ జరిగిందని, అప్పటి నుంచి అతనితో మాట్లాడటం మానేశానని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభాస్‌తో మాట్లాడలేదని తెలిపింది. 'బాహుబలి'లో ప్రభాస్ నటనను చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. గతంలో ప్రభాస్ నటనకి ఇప్పటి ప్రభాస్ నటనకి చాలా తేడా ఉందని తెలిపింది. 'బాహుబలి'లో అద్భుతంగా నటించాడని కంగనా కొనియాడింది.