విక్కీ కౌశల్‌తో సహజీవనం చేస్తున్న వెంకటేష్ హీరోయిన్!
తెలుగు చిత్రపరిశ్రమలో మల్లీశ్వరిగా గుర్తింపు పొందిన హీరోయిన్ కత్రినా కైఫ్. హీరో వెంకటేష్‌తో కలిసి నటించిన ఆమె... ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాంటి కత్రినా కైఫ్ ఇపుడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో సహజీవనం చేస్తున్నారట.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో తెగతెంపులు చేసుకున్న తర్వాత విక్కి కౌశల్‍కు కత్రినా దగ్గరైందని నటుడు హర్షవర్థన్ కపూర్ వెల్లడించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డేటింగ్‌పై స్పందించాలని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
రణబీర్, కత్రినా రిలేషన్ షిప్‍లో ఉన్నమాట నిజమే. ఒక వేళ ఈ విషయాన్ని చెప్పినందుకు తనకమేమైనా ఇబ్బందులు వస్తాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయినా తమ మధ్య ఉన్న బంధంపై ఇప్పటికే పలు సందర్భాల్లో పరోక్షంగా వెల్లడించారని హర్షవర్ధన్ చెప్పారు.
రెండేళ్లుగా తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు పరస్సరం వెళ్లి వస్తున్నారు. దీనిపై చెప్పాల్సిందిగా పలుమార్లు విక్కి కౌశల్‌ను ప్రశ్నించగా, వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం తనకు అంతగా ఇష్టం ఉండదన్నారు.
కత్రినా కైఫ్‌తో సహజీవనం చేస్తున్నది ఎప్పుడూ బహిర్గతపర్చలేదు కూడా. తరచూ కత్రినా ఇంటి విక్కి వెళ్లి వస్తుంటాడు. హర్షవర్ధన్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమారుడే కావడం గమనార్హం.