శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (11:57 IST)

టిఫిన్ సెంటర్‌కి కీర్తి సురేష్.. తందూరి ఛాయ్ కూడా...?

keethi suresh
సెలబ్రిటీలు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కాకుండా.. పాపలర్ స్ట్రీట్ ఫుడ్‌ను టేస్ట్ చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ శనివారం నాడు తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని టిఫిన్ సెంటర్‌కి మాస్క్‌ ధరించి వెళ్లింది. 
 
ఈ ఐటీ జోన్‌లోని ఒక ప్రసిద్ధ టిఫిన్ సెంటర్‌లో ఆమె అల్లం చట్నీతో ఇడ్లీ టేస్ట్ చేసింది. ఆపై తందూరీ ఛాయ్‌ని రుచి చేసింది. స్నేహితులతో కలిసి ఇలా హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్‌ను ఆమె టేస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.