పెళ్లికి ముందు నమ్రతతో నాలుగేళ్లు డేటింగ్ చేసిన మహేష్ బాబు!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. నమ్రతా శిరోద్కర్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ బహిర్గతం చేశాడు. ఆ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పెళ
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. నమ్రతా శిరోద్కర్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ బహిర్గతం చేశాడు. ఆ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పెళ్లికి ముందు మహేష్ బాబు నమ్రతతో నాలుగేళ్ళపాటు డేటింగ్ చేశాడు. అపుడెపుడో జరిగిన ఈ విషయాన్ని జయంత్ ఇపుడు ఎందుకు బహిర్గతం చేశాడన్నదే కదా మీ సందేహం. ఆ వివరాలేంటో చూద్ధాం.
మహేష్ బాబు, నమ్రతల మధ్య ప్రేమ వంశీ చిత్రంతో మొదలైంది. వాస్తవానికి ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అందుకే తన కోసం ఓ మెమరబుల్ లవ్‌స్టోరీ రెడీ చేయమని డైరెక్టర్ జయంత్‌కి చెప్పాడట మహేష్. 'ప్రేమించుకుందాం రా', 'ప్రేమంటే ఇదేరా' వంటి సినిమాలతో లవ్‌స్టోరీ స్పెషలిస్ట్‌గా జయంత్ పేరుతెచ్చుకున్న విషయం తెల్సిందే.
ఈ క్రమంలో మహేష్‌బాబుతో 'టక్కరి దొంగ' వంటి యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేశాడు. కానీ మహేష్ దృష్టంతా లవ్‌స్టోరీ సబ్జెక్ట్ పైనే వుంది. అప్పట్లో పెళ్ళికి ముందు నమ్రతతో నాలుగేళ్లు డేటింగ్ ప్రిన్స్ చేశాడట. ఆ సమయంలో జయంత్‌తో "దిల్వాలే దుల్హానియా లేజాయేంగే" రేంజ్లో లవ్‌స్టోరీ వుంటే చూడు చేద్దామని మహేష్ కోరాడట. కానీ ప్రిన్స్‌తో ఆ తరహా ప్రాజెక్ట్ చేయలేకపోయానంటూ మనసులోని మాటను జయంత్ ఇపుడు బయటపెట్టాడు.