మ‌హేష్‌... అల్ల‌రి న‌రేష్‌కి వార్నింగ్ ఇచ్చాడా..?

అల్ల‌రి న‌రేష్ న‌టించిన తాజా చిత్రం సిల్లీ ఫెలోస్. భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. చాలా రోజుల త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ - సునీల్ క‌లిసి న‌టించారు. ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందుచేత సినిమా కూడా విజ‌

srinivas| Last Modified గురువారం, 6 సెప్టెంబరు 2018 (15:11 IST)
అల్ల‌రి న‌రేష్ న‌టించిన తాజా చిత్రం సిల్లీ ఫెలోస్. భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. చాలా రోజుల త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ - సునీల్ క‌లిసి న‌టించారు. ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందుచేత సినిమా కూడా విజ‌యం సాధిస్తుంద‌నే టాక్ ఉంది. ఇదిలా ఉంటే... మ‌హేష్ మ‌హ‌ర్షి సినిమాలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గెస్ట్ రోల్ కాదు. సినిమా అంతా ఉంటాడ‌ట‌. అయితే... సిల్లీ ఫెలోస్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఇంట‌ర్వ్యూ ఇస్తోన్న అల్ల‌రి న‌రేష్‌ని అంద‌రూ అడిగే ప్ర‌శ్న మ‌హ‌ర్షి సినిమా గురించి.
 
ఈ ప్ర‌శ్న‌కు అల్ల‌రి న‌రేష్ స‌మాధానం చెబుతూ... మ‌హేష్ ఫ్రెండ్‌గా న‌టిస్తున్నాను. మ‌హేష్‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా బాగుంది. సెట్లో జోక్ పేలితే ముందుగా న‌వ్వేది మ‌హేషే. మంచి సెన్సాఫ్ హ్యామర్ ఉంద‌ని చెబుతున్నాడు. అయితే... అంత‌కుమించి మ‌హ‌ర్షి సినిమా గురించి అడిగితే... మ‌హేష్ చెప్ప‌ద్ద‌న్నాడు అంటూ మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా తెలివిగా త‌ప్పించుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే... మ‌హేష్... అల్ల‌రి న‌రేష్‌కి మ‌హ‌ర్షి గురించి ఏం చెప్ప‌వద్ద‌ని వార్నింగ్ ఇచ్చాడేమో అనే టాక్ వినిపిస్తోంది.దీనిపై మరింత చదవండి :