శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 22 ఆగస్టు 2018 (14:35 IST)

'మహ‌ర్షి'లో మ‌హేష్ త‌ల్లి పాత్ర‌లో జయప్రద...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇది మ‌హేష్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే.... ఈ సినిమాలో మ‌హేష్ త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద న‌టిస్తున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
జ‌య‌ప్ర‌ద త‌న పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటేనే న‌టిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ పాత్ర‌తో పాటు త‌ల్లి పాత్ర కూడా కీల‌క‌మ‌ట‌. అందుకని జ‌య‌ప్ర‌ద‌ని సంప్ర‌దించ‌గా... పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చేసార‌ట‌. కృష్ణ - జ‌య‌ప్ర‌ద క‌లిసి చాలా స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌లో న‌టించారు. ఇప్పుడు మ‌హేష్ బాబుకి జ‌య‌ప్ర‌ద త‌ల్లిగా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ భారీ సినిమాని ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా న‌టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.