మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (17:23 IST)

''మహానటి''లో ఎస్వీఆర్‌గా మోహన్ బాబు.. ''వివాహభోజనంబు'' పాటకు కొత్త టెక్నాలజీ?

కీర్తి సురేష్, సమంత, అర్జున్ రెడ్డి హీరో హీరోయిన్లు నటిస్తున్న మహానటి సినిమాకు సంబంధించి కొత్త వార్తొకటి ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. "మహానటి'' టైటిల్‌తో సావిత్రి జీవితచరిత్రను దర్శకుడు న

కీర్తి సురేష్, సమంత, అర్జున్ రెడ్డి హీరో హీరోయిన్లు నటిస్తున్న మహానటి సినిమాకు సంబంధించి కొత్త వార్తొకటి ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. "మహానటి'' టైటిల్‌తో సావిత్రి జీవితచరిత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎస్వీఆర్ పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాయా బజార్లో ''ఘటోత్కచుడు''గా ఎస్వీఆర్ పై చిత్రీకరించిన ''వివాహభోజనంబు'' పాటను ఇప్పటికీ మరిచిపోలేం. 
 
ఎస్వీఆర్‌గా మోహన్ బాబుపై ఆ పాటను చిత్రీకరించే ఆలోచనలో మహానటి దర్శకులు వున్నట్లు తెలిసింది. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి ఆ పాటను మరింత అద్భుతంగా తెరకెక్కించాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అదే కనుక జరిగితే ఈ సినిమాలో మోహన్ బాబు రోల్ హైలైట్ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ఇకపోతే.. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ చేస్తుండగా, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. ఇక ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.