త్వరలో నయనతార నిశ్చితార్థం.. 2020లో ముహూర్తం ఖరారు?

Last Updated: సోమవారం, 6 మే 2019 (12:07 IST)
లేడీ సూపర్ స్టార్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లోనూ నయన పెళ్లిపై వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతుంది నయనతార. 
 
ఇంకా ఆమే నెంబర్ వన్. వరుస హిట్ల మీదున్న నయన.. అవార్డుల పరంగానూ దూకుడును కొనసాగిస్తోంది. ఆమె సినిమా చేసిందంటే ఆ ఏడాది అన్ని అవార్డులు ఆమె కోస‌మే ప‌రుగులు తీస్తున్నాయి.
 
గత ఏడాది రెండు హిట్లు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో కూడా ఈమె వ‌ర‌స సినిమాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవితో సైరా సినిమాల్లో న‌టిస్తోంది. అన్ని భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 60 సినిమాల్లో న‌టించింది. ఇక ఇప్పుడు ఈమె పెళ్లిపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివ‌న్‌తో నిశ్చితార్థానికి సిద్ధ‌మ‌వుతుంది న‌య‌న‌తార‌. 
 
నయనతారకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వేడుకలా చేయడం, ఆ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ అలవాటు. వీరిద్దరి అన్యోన్యతను గమనించిన పెద్దలు త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు వినికిడి. ఇరు కుటుంబాల అంగీకారంతోనే త్వ‌ర‌లోనే ఈ జంట ఒక్కటి కానుంది. త్వరలోనే వీరికి ఎంగేజ్‌మెంట్ జరుగనుందని టాక్ వస్తోంది. 
 
కానీ పెళ్లి మాత్రం వచ్చే ఏడాది 2020లో వుంటుందని టాక్. నయన్‌ ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’, రజనీకాంత్‌తో ‘దర్బార్‌’, శివ కార్తికేయన్‌తో ‘మిస్టర్‌ లోకల్‌’లో నటిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :