మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chj
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (21:24 IST)

బాబోయ్... పవన్ కళ్యాణ్‌‌తో ఆ క్యారెక్టర్ చేయనంటే చేయను

పవన్ కళ్యాణ్‌‌తో నటించనని తెగేసి చెబుతోంది నివేదా థామస్. జెంటిల్ మేన్ సినిమాలో నానికి జోడిగా నటించిన నివేదా థామస్ మళ్ళీ నిన్నుకోరి సినిమాలో నటించింది. తాజాగా జూనియర్ ఎన్‌టిఆర్ సరసన జై లవకుశలో కూడా నటించింది. నివేదా థామస్ సినిమాలన్నీ హిట్ టాక్‌తో ముంద

పవన్ కళ్యాణ్‌‌తో నటించనని తెగేసి చెబుతోంది నివేదా థామస్. జెంటిల్ మేన్ సినిమాలో నానికి జోడిగా నటించిన నివేదా థామస్ మళ్ళీ నిన్నుకోరి సినిమాలో నటించింది. తాజాగా జూనియర్ ఎన్‌టిఆర్ సరసన జై లవకుశలో కూడా నటించింది. నివేదా థామస్ సినిమాలన్నీ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్లాయి. 
 
అందం, అణకువ, నటనలో మంచి ప్రావీణ్యత దూసుకుపోతోంది నివేదా థామస్. పవన్ సినిమాలో చెల్లెలిగా నటించే అవకాశం నివేదాకు వచ్చిందట. దీంతో ఆ క్యారెక్టర్ చేయనని తేల్చి చెప్పిందట. ఇప్పుడిప్పుడే కెరీర్లో అడుగులు వేస్తున్న ఈ సమయంలో చెల్లెలి పాత్రలేంటి అని దర్శకుడ్ని ప్రశ్నించిందట నివేదా థామస్. 
 
పవన్ సినిమాలో నటించనని చెప్పినందుకు చాలా బాధపడ్డానని.. ఆయన సినిమాలో కొద్దిసేపయినా నటించే అవకాశం దొరకాలని, అయితే ఆ క్యారెక్టర్ హీరోయిన్‌గా ఉండాలని చెబుతోంది. అంతేకాదు లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటించాలని తనకు ఉందని చెబుతోంది నివేదా థామస్.