శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:28 IST)

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ దసరాకు లేనట్టే.. దీపావళికి ఖాయం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ దసరాకు వస్తుందని అభిమానులు వేయి కనులతో ఎదురుచూశారు. త్రివిక్రమ్-పవన్ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ దసరాకు వస్తుందని అభిమానులు వేయి కనులతో ఎదురుచూశారు.  త్రివిక్రమ్-పవన్ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే విదేశాల్లో షూటింగ్ జరుపుకున్నది. అయితే దసరాకు ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ విడుదలవుతుందని భావించిన పవన్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
 
తివిక్రమ్ అండ్ టీం ఈ మూవీ టీజర్‌ను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూపొందించిన స్పెషల్ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ తాజా చిత్రానికి అజ్ఞాత వాసి అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ పవన్ కల్యాణ్‌కు జంటగా నటిస్తున్నారు.