మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (12:22 IST)

పవన్ ఆ పని చేశారు.. అందుకే ఆయనంటే ఇష్టం: శివబాలాజీ

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ చెప్పాడు. శివబాలాజీ పవన్ కల్యాణ్ అభిమాని. సాధారణంగా పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని. పవన్‌తో తనకు ఏడేళ్ల పరి

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ చెప్పాడు. శివబాలాజీ పవన్ కల్యాణ్ అభిమాని. సాధారణంగా పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని. పవన్‌తో తనకు ఏడేళ్ల పరిచయం వుందన్నాడు. ఏడేళ్ల క్రితం అన్నవరం సినిమా షూటింగ్ సందర్భంగా పరిచయమైందని తెలిపాడు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతోందని అన్నాడు.
 
సాధారణంగా పవన్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు ఇష్టపడరని.. కానీ కాటమరాయుడు సినిమా షూటింగులో తన  పుట్టిన రోజును మాత్రం యూనిట్ సభ్యులందరి మధ్య, తన కుటుంబ సభ్యులందరి సమక్షంలో చేశారు. అది తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. అందుకే పవన్ కల్యాణ్ కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. తను ప్రజానాయకుడు కావడంతో ఆయనకు కత్తిని బహూకరించానని శివబాలాజీ వెల్లడించాడు.
 
మరోవైపు ‘బిగ్‌బాస్’ విజేత శివబాలాజీ తన మాజీ హౌస్‌మేట్ ధనరాజ్ ఇంటికి వెళ్లాడు. ధన్‌రాజ్ రెండవ బిడ్డను ఎత్తుకుని ముద్దాడాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ‘బిగ్‌బాస్’ విజేతగా నిలిచిన తర్వాత శివబాలాజీ తన భార్య, నవదీప్‌తో కలిసి ధన్‌రాజ్ ఇంటికి వెళ్లాడు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ధన్‌రాజ్ తండ్రి అయినందుకు శివబాలాజీ అభినందించాడు. 
 
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ధన్‌రాజ్‌కు కొడుకు పుట్టాడని శుభవార్త అందింది. కొడుకు పుట్టడానికి నాలుగు రోజుల ముందు ధన్‌రాజ్ ఆలోచనలన్నీ తన ఇంటి వైపే ఉండేవి. ఈ ఆలోచనతో వంటగదిలో పాత్రలు కడిగేటప్పడు గ్లాసులన్నీ పగిలిపోయాయి. 
 
ధన్‌రాజ్ ఇంటి గురించి ఆలోచిస్తూ చాలా వర్రీ అయ్యేవాడు. ఎలిమినేషన్ రోజు బయటకి వెళ్లేటప్పుడు అందరూ బాధపడుతారు. కానీ ధన్‌రాజ్ మాత్రం ఎగిరి గంతేశాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ధన్‌రాజ్‌ ఇంటికి వెళ్లి.. బాబును చూడాలనుకున్నానని శివబాలాజీ చెప్పకొచ్చాడు.