ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr

దీపావళికి పవన్ - త్రివిక్రమ్ టీజర్...

హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో పీకే 25వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయ

హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో పీకే 25వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ఫస్ట్ లుక్‌ను దసరాకు విడుదలవుతుందని భావించిన పవన్ ఫ్యాన్స్‌కు కాస్త బ్రేక్ పడింది. తివిక్రమ్ అండ్ టీం ఈ మూవీ టీజర్‌ను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
కాగా, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూపొందించిన స్పెషల్ టీజర్‌‍ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ తాజా చిత్రానికి "అజ్ఞాత వాసి" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.