శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:46 IST)

సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడమే కష్టమంటున్న నుపూర్‌ సనన్‌

nujpur sanon
nujpur sanon
నుపూర్‌ సనన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్‌ నటిగా గుర్తింపు పొందింది. రవితేజతో టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తోంది. తాజాగా షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీఫిలింసిటీలో జరుగుతోంది. ఇక్కడికి గతంలో తన సోదరి కృతిసనన్‌తో కలిసి 2016లో వచ్చాననీ, దిల్‌ వాలే సినిమాకు వచ్చి అక్కడే కొద్దిరోజులు చాలా విషయాలు తెలుసుకున్నానని చెబుతోంది. 
 
తెలుగు సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ, నటించడం కంటే ఆడిషన్‌ ఇవ్వడం కష్టంగా వుందని చెప్పింది. ఆడిషన్‌లో అందరినీ మెప్పించాలని అంది. ఇక మనకు తెలీని భాషలో భావోద్వేగాలు పండించడం చాలా కష్టంగా అనిపిస్తుందని తెలిపింది. ఏదిఏమైనా నేను కొత్త అయినా ఇక్కడి యూనిట్‌ అంతా ఇస్తున్న గౌరవం చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీ గొప్పగా వుందని కితాబిచ్చింది.