సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (12:30 IST)

ఫ్యాన్స్ ఫోకస్ అంతా 'అన్నయ్య'పైనే ఉండాలి.. అందుకే నేను వెళ్లలేను : పవన్ కళ్యాణ్

అన్న చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నం.150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం సాయంత్రం గుంటూరు వేదికగా జరుగనుంది. ఈ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. కానీ, చిరంజీవి సోదరుడు, హీరో ప

అన్న చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నం.150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం సాయంత్రం గుంటూరు వేదికగా జరుగనుంది. ఈ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. కానీ, చిరంజీవి సోదరుడు, హీరో పవన్ కళ్యాణ్ వస్తారా? రారా? అనే అంశంపై మాత్రం తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు దూరంగా ఉండటానికి గల కారణాలను ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఈ వేడుకలో పాల్గొనకుండా ఉండేందుకు షూటింగ్ ఉండటం పెద్ద అడ్డంకి కాదని.. అన్నయ్య ప్రతిష్టాత్మక చిత్రంలో ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆయన మీదే ఉండాలని... తాను ఫంక్షన్‌కు వస్తే ఫోకస్ డివైడ్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
 
ఈ నేపథ్యంలోనే ఫంక్షన్ కు హాజరుకాకూడదనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు తెలుస్తోంది. మెగా హీరోలందరి ఫ్యాన్స్ కలసికట్టుగా ఉంటున్నప్పటికీ... పవన్ అభిమానులు మాత్రం వీరితో కొంచెం గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్న సంగతి తెలసిందే. మెగా హీరోల ఫంక్షన్లలో కూడా పవన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీరికి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో, తాను ఫంక్షన్‌కు హాజరయితే... అభిమానులు రెండుగా చీలిపోయే అవకాశం ఉందనేది పవన్ అభిప్రాయమని తెలుస్తోంది.