శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2017 (19:52 IST)

మీ సేల్స్ కోసం అలా చెప్పాలా? వెళ్లండి వెళ్లండి: పూజా హెగ్డే

నా చిన్నప్పటి నుంచి ఎంతోమందిని చూశా. కొంతమంది స్నేహితులు నోరుతెరిస్తే అబద్ధాలే. నాకు అది ఏ మాత్రం ఇష్టం లేదు. మా ఇంట్లో నన్ను క్రమశిక్షణగానే పెంచారు. ఇతరులకు ఇబ్బంది కలిగించని అబద్ధాలు తప్ప హాని చేసేవి అస్సలు చెప్పకూడదని నా తల్లి నేర్పింది. అందుకే నే

నా చిన్నప్పటి నుంచి ఎంతోమందిని చూశా. కొంతమంది స్నేహితులు నోరుతెరిస్తే అబద్ధాలే. నాకు అది ఏ మాత్రం ఇష్టం లేదు. మా ఇంట్లో నన్ను క్రమశిక్షణగానే పెంచారు. ఇతరులకు ఇబ్బంది కలిగించని అబద్ధాలు తప్ప హాని చేసేవి అస్సలు చెప్పకూడదని నా తల్లి నేర్పింది. అందుకే నేను అబద్ధం చెప్పను. ఇప్పటివరకు అబద్ధాలు చెప్పలేదంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. ఒక అబద్ధం ఎన్నో పరిణామాలను చవిచూడాల్సి ఇచ్చింది. ఆ తరువాత జీవితమంతా అబద్ధాలే చెప్పుకొని బతికేయాల్సి వస్తోంది అంటోంది.
 
తనకు డబ్బు కంటే పరువే ముఖ్యమని, ఎదుటి వారిని మోసం చేసి బతకాల్సిన అవసరం తనకు లేదంటోంది. తాజాగా ఒక కంపెనీ ప్రతినిధులు పూజా హెగ్డేను కలిసి వెయిట్ లాస్ యాడ్‌లో నటించమని కోరారు. ఆ యాడ్‌కు కోటిరూపాయలకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ కంపెనీకి సంబంధించిన టాబ్లెట్ వాడితే వెయిట్ లాస్ అవుతుందనేది ఆ యాడ్ ముఖ్య ఉద్దేశం. ఇది మొత్తం అబద్థమే. 
 
వెయిట్ లాస్ కావడానికి వ్యాయామం లేకుంటే ఆహార నియమాలు పాటించాలే తప్ప మందులు వాడి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకుని అనారోగ్యంపాలు కావడం మంచిది కాదు. అందుకే నేను ఆ యాడ్‌లో నటించనని వారికి ముఖం మీదే చెప్పాను. అబద్ధం చెప్పను. ఎదుటివారికి ఇబ్బందిపడే విధంగా ప్రవర్తించనని చెబుతోంది పూజా హెగ్డే. పూజా తీసుకున్న నిర్ణయంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
పూజా హెగ్డే ముందు నుంచి ముక్కుసూటి మనిషి. తన వద్ద ఎవరైనా అబద్ధాలు ఆడినట్లు తెలిస్తే మాత్రం ఆమె వారితో మాట్లాడటం మానేస్తుంది. సంవత్సరం వరకు అబద్ధాలు చెప్పిన వారితో మాట్లాడదు. అప్పుడు వారిలో మార్పు వచ్చింది ఇక అబద్ధాలు చెప్పరు అనుకుంటే మాత్రం తిరిగి మాట్లాడుతుంది తప్ప లేకుంటే స్నేహాన్ని కట్ చేసుకుంటుందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.