బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 17 జులై 2017 (17:33 IST)

డ్రగ్స్ కేసులో రానా, అభిరామ్ పేర్లా? పిచ్చి పుకార్లంటూ...

డ్రగ్స్ కేసులో పలువురు సినిమా నటీనటుల పేర్లు వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం చెలరేగింది. తాజాగా హీరో రవితేజకు నోటీసులు అందినట్లు ఆయన తల్లి రాజ్యలక్ష్మి ధృవీకరించారు. మరికొందరి పేర్లు వున్నాయంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరో జాబితాలో వారి

డ్రగ్స్ కేసులో పలువురు సినిమా నటీనటుల పేర్లు వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం చెలరేగింది. తాజాగా హీరో రవితేజకు నోటీసులు అందినట్లు ఆయన తల్లి రాజ్యలక్ష్మి ధృవీకరించారు. మరికొందరి పేర్లు వున్నాయంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరో జాబితాలో వారి పేర్లు వెల్లడవుతాయంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు రానాతో పాటు ఆయన సోదరుడు అభిరామ్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన వార్తలపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మండిపడ్డారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చినట్లు టాలీవుడ్ సినీజనం పేర్కొంటున్నారు. అనవసరపు పుకార్లు సృష్టించవద్దని తెలియజేసినట్లు సమాచారం.