గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 మే 2024 (14:04 IST)

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

meena ise land
meena ise land
ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్ సినిమాలో పుష్ప.. పుష్ప.. సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రజాదరణ పొందింది. కాగా, నిన్న సీనియర్ నటి మీనా ఈ పాటకు డాన్స్ లేస్తూ సందడి చేసింది. అదెక్కడంటే యూరప్ లోని ఐస్ లాండ్ లో జరిగింది. తన ఇన్ స్ట్రాలో ఆమె పుష్ప.. పుష్ప.. సాంగ్ కు స్టెప్ లేస్తూ ఎంజాయ్ చేసింది.
 
పైగా సోషల్ మీడియాలో.. దీనికి ఓ కాప్సన్ కూడా జోడించి మంచు, నిప్పు.. అదిరిపోయే కాంబినేషన్ అని పోస్ట్ చేసింది. ఐస్ లాండ్ లాంటి చోట మంచులో ఉండి ఫుష్ప వంటి ఫైర్  అనే డైలాగ్ తో పోలిక చేసిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా, పుష్ప 2 లో ఐటెం సాంగ్ వుందనీ, దానిలో ఓ హీరోయిన్ నటించనున్నదని టాక్ వుంది. మరి మీనా నేనా అనే అనుమానం కూడా కలుగుతుంది.