శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 మే 2024 (09:34 IST)

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

Devara Fear Song
Devara Fear Song
మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.  ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
 
మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దేవర’ చిత్రం నుంచి తొలి పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘ఫియ‌ర్ సాంగ్‌’ అంటూ రిలీజైన ఈ పాట‌ను స‌ర‌స్వ‌తీపుత్ర రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాశారు. పాట‌లో లైన్స్ ఎన్టీఆర్ పోషించిన ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లోని గ‌ర్జ‌న‌ను తెలియ‌జేస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించ‌ట‌మే కాకుండా పాట‌ను అద్భుతంగా పాడారు. దేవ‌ర‌-లార్డ్ ఆఫ్ ఫియ‌ర్‌గా పాట నెక్ట్స్ లెవ‌ల్ ఎలివేష‌న్ ఇస్తోంది. అలాగే పాట‌లోని ఎన్టీఆర్ గ్లింప్స్ అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి.
 
తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో భాష‌ల్లోనూ ఈ పాట విడుద‌లవ‌గా అన్నీ లాంగ్వేజెస్‌లో పాట విన‌టానికి అద్భుతంగా ఉంది. అనిరుద్ ర‌విచంద‌ర్ తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో పాట‌ను పాడారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సంతోష్ వెంకీ  పాట‌ను ఆల‌పించారు. తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన దేవ‌ర ఫియ‌ర్ సాంగ్ మంచి ట్రీట్‌లా అంద‌రినీ అల‌రిస్తోంది. పాట‌లోని నిర్మాణ విలువ‌లు, గ్రిప్పింగ్ విజువ‌ల్స్‌, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి.
 
‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.