గురువారం, 22 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:32 IST)

అనవసర ఖర్చు పెట్టను.. మీ ఇష్టంవచ్చినట్లు చేయండి!

ప్రతి చిత్రానికి ప్రమోషన్‌ చాలా ముఖ్యం. ప్రతివారూ చెప్పేది... రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి.. దాన్ని పబ్లిసిటీ విషయంలో ఉచితంగా సోషల్‌ మీడియాల్లో పెట్టేసి 'బాహుబలి' టైప్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలన

ప్రతి చిత్రానికి ప్రమోషన్‌ చాలా ముఖ్యం. ప్రతివారూ చెప్పేది... రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి.. దాన్ని పబ్లిసిటీ విషయంలో ఉచితంగా సోషల్‌ మీడియాల్లో పెట్టేసి 'బాహుబలి' టైప్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తుంటారు. ఈ ట్రెండ్‌ అప్పటి నుంచి మొదలైంది. 
 
ఆ బ్యాచ్‌కు చెందిన సాయికొర్రపాటి.. చకచక సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు.. 'మనమంతా' సినిమా తీసి నష్టపోయాడు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్‌ కాలేదు. సినిమా బాగుందని చెప్పినా.. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో తాజాగా 'జ్యో అచ్యుతానంద' సినిమా తీశాడు. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 9వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ సినిమా గురించి నిర్మాత పట్టించుకోకపోగా వివరాలు మీడియా ప్రతినిధులు అడిగితే.. అనాసక్తత వ్యక్తం చేశాడు. మీ వల్ల సినిమాలు ఆడితే అన్ని సినిమాలు ఆడాలి అన్నంతగా వ్యాఖ్యానాలు చేస్తూ.. నా సినిమాకు అనవసరమైన ఖర్చుపెట్టనంటూ మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండని.. చెప్పడం విశేషం.