సమంతను వివాదంలోకి నెట్టిన ఆకతాయిలు!

Ganesh| Last Updated: మంగళవారం, 3 జూన్ 2014 (13:31 IST)
టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత సోషల్ నెట్‌వర్కింగ్
సైట్ ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా సంగతులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. గతంలో మహేష్ బాబు నటించిన ''1'' నేనొక్కడినే సినిమాపై తన ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అయితే ఇపుడు తాజాగా తన ప్రమేయం లేకుండానే వివాదంలో ఇరుక్కుంది.

ఇటీవల ''ఆగడు'' సినిమాపై సమంత సంచలన కామెంట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. 'ఆగడు' టీజర్ రిలీజైన సందర్భంగా సమంత పేరిట ఓ ట్వీట్ నెట్లో హల్‌చల్ చేసింది. 'ఈ టీజర్ కాపీ' అంటూ సమంత అందులో ట్వీట్ చేసినట్లు ఎవరో ఆకతాయిలు ట్వీట్ చేయడంతో సమంత వెంటనే జాగ్రత్తపడింది. ఆ ట్వీట్‌తో తనకు సంబంధం లేదనీ, ఎవరో కావాలని చేసినదనీ ఈ ముద్దుగుమ్మ చెప్పింది.
దీనిపై మరింత చదవండి :