శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (12:26 IST)

ఆ అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదు : కన్నడ హీరోయిన్ సంచితాశెట్టి

శాండల్‌వుడ్‌లో కలకలం రేపిన ఆ అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదని కన్నడ హీరోయిన్ సంచితాశెట్టి స్పష్టం చేసింది. అశ్లీల వీడియోలో బద్మాష్‌ హీరోయిన్ సంచితాశెట్టి ప్రత్యక్షం కావడంతో ఆమె అభిమానులు తీవ్ర కలత చె

శాండల్‌వుడ్‌లో కలకలం రేపిన ఆ అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదని కన్నడ హీరోయిన్ సంచితాశెట్టి స్పష్టం చేసింది. అశ్లీల వీడియోలో బద్మాష్‌ హీరోయిన్ సంచితాశెట్టి ప్రత్యక్షం కావడంతో ఆమె అభిమానులు తీవ్ర కలత చెందారు.
 
సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమెకు కుప్పలు తెప్పలుగా ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. దీనిపై మీడియాకు వివరణ ఇచ్చిన సంచితా ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు. ఇలాంటి కుట్రకు ఎవరు పాల్పడ్డారో తనకు తెలియదన్నారు.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ ఈ వీడియోలను పట్టించుకోవద్దని అభిమానులకు ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తాను ఎలాంటిదానినో కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శాండల్‌వుడ్‌ పరిశ్రమ పెద్దలకు బాగా తెలుసునన్నారు.
 
మూడు రోజుల క్రితమే తాను ఈ విషయాన్ని సైబర్‌ పోలీసుల దృష్టికి తెచ్చానని, ఈ వీడియో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. వీటిని తాను ఏమాత్రం పట్టించుకోకుండా యధావిధిగా షూటింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు.