శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (21:35 IST)

ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో సాహో హీరోయిన్?!

Shradha Kapoor
ఆర్ఆర్ఆర్ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సాహో హీరోయిన్ జతకట్టనుంది. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అలనాటి అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది.
 
ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ 1, 2తో ఇండియా టాప్ డైరెక్టర్లతో ఒకరిగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు తారక్ ఒప్పుకున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ తీస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కొరటాలతో తారక్ సినిమా పూర్తవగానే నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని టాక్ వస్తోంది. ఈ సినిమాలో సాహోతో టాలీవుడ్‌కు పరిచయం అయిన శ్రద్ధా కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనుందని టాక్ వస్తోంది.