సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:11 IST)

సర్కారు వారి పాట మూవీ అమెరికా షెడ్యూల్ ఉందా? లేదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే... బ్యాంక్‌లో లోన్లు తీసుకుని అప్పు ఎగ్గొట్టే ఓ మోసగాడుకు హీరో ఎలా బుద్ది చెప్పాడు అనేదే ఈ సినిమా కథ అని వార్తలు వస్తున్నాయి.
 
అయితే... కథకనుగుణంగా ఈ సినిమాను కొంత భాగం అమెరికాలో షూట్ చేయాలి. ప్రస్తుతం కరోనా కారణంగా అమెరికాలో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే... అక్టోబర్ నెలాఖరు నుంచి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. నవంబర్ నుంచి ఇంకా తగ్గుతుంది. అందుచేత అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఒకవేళ అప్పటికి కరోనా తగ్గకపోతే అప్పుడు ఇక్కడే షూట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
 
ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఈ భారీ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. పరశురామ్ ఖచ్చితంగా మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ మూవీని అందిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి... బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.