సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (16:02 IST)

మహేష్‌ రికార్డ్‌ను చిరు క్రాస్ చేస్తారా..?

ఒకప్పుడు సినిమాలు 365 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత 200 రోజులు 175 రోజులు, 100 రోజులు ఆడడం చూసాం. తమ అభిమాన హీరో నటించిన సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్స్‌లో ఆడింది అంటూ గొప్పగా అదో రికార్డ్ గా చెప్పుకునేవారు అభిమానులు. ఇప్పుడు 100 రోజుల రికార్డులు పోయి కలెక్షన్స్ రికార్డ్‌గా మారాయి.
 
ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్, ఫస్ట్ వీక్ కలెక్షన్ రికార్డ్, ఫుల్ రన్ రికార్డ్... అంటూ కలెక్షన్స్ రికార్డులు పుట్టుకొచ్చాయి. అయితే... ఇప్పుడు సినిమాల రిలీజ్ లేకపోవడం తెలిసిందే. లేటెస్ట్‌గా నెట్టింట్లో రికార్డులు స్టార్ట్ అయ్యాయి.
 
 ఇంతకీ మేటర్ ఏంటంటే... మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్‌తో వరల్డ్ రికార్డు సృష్టించాడు మహేష్‌ బాబు.
 
ఈ నెలలో 22న చిరంజీవి పుట్టినరోజు ఉంది. అందుచేత ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరి టార్గెట్ మహేష్‌ క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డును క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు ఈ టార్గెట్ పైనే ఉంది. మరి.. మహేష్ రికార్డ్‌ను చిరు క్రాస్ చేస్తారా..? సరికొత్త రికార్డ్ సృష్టిస్తారా..? లేదా..? అనేది తెలియాలంటే ఆగష్టు 22 వరకు ఆగాల్సిందే.