బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (21:11 IST)

రూ.2కోట్ల రింగ్ కాదు.. బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేశాను..

Tamannah
Tamannah
తెల్లపిల్ల తమన్నా రూ.2కోట్ల విలువైన ఆ రింగ్‌ను గిఫ్ట్‌గా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన తమన్నా.. అది డైమండ్ ఉంగరం కాదని.. ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది డైమండ్ రింగ్ కాదని, ఓ బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేసినట్టు ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించింది. 
 
ప్రపంచంలో ఐదో అతి పెద్ద వజ్రం పొదిగిన ఉంగరంతో ధరించిన తమన్నా ఫొటోలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీని విలువ రూ. 2 కోట్లు అని, ఈ డైమండ్ రింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు బహుమతిగా లభించిందని జోరుగా వార్తలు వచ్చాయి. 
 
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిలో తమన్నా నటనకు గాను ఈ ఉంగరాన్ని తమన్నాకు ఉపాసన గిఫ్టుగా ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అది డైమండ్ రింగ్ కాదని క్లారిటీ ఇచ్చేసింది.