శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (10:15 IST)

తమన్‌ను నువ్వు దేవుడువి సామీ.. అంటోన్న ట్రోలర్స్

Trivikram Srinivas, SS Thaman, Pavan Kalyan
సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు వెళ్లడంపై మీ స్పందన ఏంటనే ప్రశ్నకు బదులివ్వడం ప్రస్తుతం ఆయనను ట్రోలింగ్‌కు దారితీసింది. 
 
రాజమౌళి లాగానే త్రివిక్రమ్ కూడా మమ్మల్ని ఆస్కార్ అవార్డుకు తీసుకువెళ్తారని అంటూ తమన్ చెప్పాడు. దీంతో ఇప్పటివరకు పాన్ ఇండియా తీయని త్రివిక్రమ్ మిమ్మల్ని ఆస్కార్‌కు ఎలా తీసుకువెళ్తాడంటూ కొంతమంది ట్రోల్ చేయడం జరుగుతోంది. 
 
ఈ విషయంలో ట్రోలర్స్, మీమర్స్ మరోసారి తమన్ అడ్డంగా దొరికిపోయాడు. ఇక సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరల్ చేస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న హ్యాట్రిక్ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రం కాదు.. మరి తమన్ ఎలా ఆ మాట అన్నాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంకా తమన్‌ను నువ్వు దేవుడువి సామీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.