శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (11:32 IST)

ప్రిన్స్ మహేష్ బాబుకు విలన్‌గా ఐశ్వర్యా రాయ్!?

AishwaryaRai
ప్రిన్స్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍‌లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తుంటే, మరో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఇది మహేష్ బాబుకు 28వ చిత్రం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తుంది. ఇందులో ఉండే నెగెటివ్ షేడ్ పాత్రకు బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను ఎంపిక చేయాలన్న పట్టుదలతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తుంది. 
 
సాధారణంగా త్రివిక్రమ్ తన చిత్రాల్లోని ఒక కీలకమైన పాత్రను సీనియర్ నటీమణులతో చేయిస్తుంటారు. అలా గతంలో నదియా, ఖుష్బూ, స్నేహ, టబు వంటి వారితో చేయించారు. ఇపుడు ఐశ్వర్యా రాయ్‌ను రంగంలోకి దించేందుకు ఆయన ప్లానే చేశారు. ఇందుకోసం ఆమెను ఇప్పటికే సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో ఈ నెగెటివ్ పాత్రను ఐశ్వర్యతో చేయించాలన్న భావిస్తున్నారు. పైగా, గత యేడాది విడుదలైన "పొన్నియిన్ సెల్వన్" చిత్రంలో కూడా ఐష్ నెగెటివ్ పాత్రను పోషించారు. ఈ చిత్రం రెండో భాగంలో ఆమె మరింత విలనిజంతో రెచ్చిపోగా, ఇది ఈ యేడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదలకానుంది.