శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:42 IST)

కేరళ స్టోరీస్‌ ఆదాశర్మకు ఫుడ్ అలెర్జీ.. ఆస్పత్రిలో చేరిక

adah sharma
దక్షిణాది నటి ఆదాశర్మ కేరళ స్టోరీస్‌తో బాగా పాపులర్ అయ్యింది. హిందీ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో ఆదాశర్మ నటించింది. దర్శకుడు సుదీప్ సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' కలెక్షన్లతో వివాదాన్ని కూడా సృష్టించింది.
 
రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమాలో నటించినందుకు నటి అదా శర్మకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి ఆదా శర్మ తన తదుపరి చిత్రం ప్రమోషన్‌లో పాల్గొంది.

దీంతో ఆదాశర్మ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఫుడ్ అలర్జీ వంటి సమస్యలు ఉన్నాయని, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని కుటుంబీకులు తెలిపినట్లు సమాచారం.