శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (10:02 IST)

బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేయడం వల్ల సన్నబడ్డాను-రాశీఖన్నా

Rasi Khanna
తన ప్రేమాయణం గురించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా నోరు విప్పింది. గతంలో తాను ఓ వ్యక్తితో ప్రేమలో వున్నానని.. అతనితో బ్రేకప్ కావడంతో చాలా డిప్రెషన్‌కు గురయ్యానని తెలిపింది. 
 
థైరాయిడ్ సమస్య కూడా వేధించడంతో విపరీతంగా బరువు పెరిగానని.. ఎన్నో వర్కౌట్లు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపింది. ఈ ఎఫెక్టుతో సినిమాలు కూడా దూరమయ్యాయని వెల్లడించింది. 
 
చివరకు తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడని.. అతనితో డేటింగ్ ప్రారంభించిన తర్వాత బరువు తగ్గానని.. స్లిమ్‌గా మారానని రాశీఖన్నా తెలిపింది. 
 
అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం రాశీ దాచిపెట్టేసింది. డిప్రెషన్ వల్ల బరువు పెరిగాను.. బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేయడం వల్ల తాను వెయిట్ లాస్ అయ్యాను అని రాశీ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే రాశిఖన్నా సినిమాల విషయానికి వస్తే... 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' సినిమాలు గత ఏడాది విడుదల అయ్యాయి. తెలుగులో ప్రస్తుతం రాశీఖన్నాకు పెద్దగా సినిమాలు లేవు. ప్రస్తుతం తమిళం, హిందీలో ఆమె సినిమాలు చేస్తోంది.