శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:02 IST)

ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. ప్రపోజ్ చేసేందుకు హైదరాబాద్ వస్తున్నా... కంచి చీర కట్టుకుని?

కోల్‌కతా చెందిన అమ్మాయి ప్రభాస్‌ను పెళ్లాడేందుకు ఒంటి కాలిపై నిలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌ను పెళ్ళి చేసుకునేందుకు భారీ స్థాయిలో ప్రపోజల్స్ వచ్చి పడుతున్నాయి. తాజాగా కోల్‌క‌తాకు చెందిన సుభ‌ద్రా ముఖ‌ర్

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ప్రభాస్.. ప్రస్తుతం సాహో సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. బాహుబలి కోసం ఐదేళ్ల పాటు పెళ్లిని వాయిదా వేసుకున్న ప్రభాస్.. సాహో సినిమాకు తర్వాత స్పైడర్ దర్శకుడు మురుగదాస్‌తో చేతులు కలుపనున్నాడని తెలుస్తోంది.

సాహో తమిళం, హిందీతో రిలీజ్ కానుండగా, మురుగదాస్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వస్తుందని.. ఇంతలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో మురుగదాస్ సినిమా చేసేస్తాడని తెలుస్తోంది.
 
ఇకపోతే ప్రభాస్-దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేయనున్నాడట. ఈ రెండు ఫినిష్ అయ్యాకే ప్రభాస్- మురుగదాస్ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమంటున్నారు. ఇంతలో ప్రభాస్ పెళ్లి సంగతులు కూడా వుంటాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా చెందిన అమ్మాయి ప్రభాస్‌ను పెళ్లాడేందుకు ఒంటి కాలిపై నిలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌ను పెళ్ళి చేసుకునేందుకు భారీ స్థాయిలో ప్రపోజల్స్ వచ్చి పడుతున్నాయి. తాజాగా కోల్‌క‌తాకు చెందిన సుభ‌ద్రా ముఖ‌ర్జీకి కూడా ప్ర‌భాస్ అంటే చాలా ఇష్టమని చెప్తోంది. 
 
ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి తాను దేనికైనా సిద్ధపడతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన ప్రేమను ప్రభాస్‌కు చెప్పేందుకు అతని పుట్టిన రోజైన అక్టోబర్ 23న హైదరాబాదుకు వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతోంది. ప్రభాస్‌ను కలిసేలా చేస్తానని ఆయన సెక్రటరీ హామీ ఇచ్చారని.. ప్రభాస్ కోసం బహుమతులు కూడా తీసుకెళ్తున్నానని వెల్లడించింది. బాహుబలి సినిమాను 20 సార్లు చూసిన సుభద్ర చిన్నస్థాయి మోడల్‌గా పనిచేస్తోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే సుభద్ర ప్రభాస్‌కు ప్రపోజ్ చేయనుంది. 
 
అంతేగాకుండా ప్రభాస్‌ను కలిసేవేళ భారీ కానుకగా ఇచ్చేదిశగా లక్ష పెట్టి బాహుబలి విగ్రహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ విగ్రహానికి కాస్ట్యూమ్ డిజైనర్ సమరేంద్ర సింగ్ రాయ్ దుస్తులు డిజైన్ చేశారు. ఈ దుస్తుల ధర రూ.20వేలట. ఇంకా ప్రభాస్‌కు ప్రపోజ్ చేసే రోజున కాంచీపురం చీరను కట్టుకోనుంది. ఆయనతో ఎలా ప్రపోజ్ చేయాలో కూడా ప్రాక్టీస్ చేస్తోంది. అలాగే ప్ర‌ముఖ గాయని ఉషా ఉతుప్‌తో ప్రభాస్‌పై నాలుగు పాటలు కూడా పాడించిందట.