సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 మార్చి 2024 (17:08 IST)

త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్ ను కలిపిన వివేక్ కూచిబొట్ల?

Trivikram Srinivas - Thaman
Trivikram Srinivas - Thaman
సినిమారంగంలో దర్శకులు, హీరోలు స్వంత బేనర్ లు పెట్టి చిత్రాలు నిర్మించడం మామూలైపోయింది. ఇటీవలే త్రినాథ్ దర్శకుడు నిర్మాతగా మారి చిన్న సినిమాలను నిర్మించే పనిలో వున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా ఫార్టూన్ ఫోర్ నిర్మాణ సంస్థను స్థాపించి నాగ వంశీ నిర్మాతతో పలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా టిల్లు స్వేర్ సినిమా తీశారు. కాగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టి.జి. విశ్వప్రసాద్ తో కలిసి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు తీసిన వివేక్ కూచిబొట్లకు పీపుల్స్ మీడియా జర్క్ ఇచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది.
 
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వనాథ్ వారసులు ఆర్థికపరమైన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని లోపాలున్నట్లు గ్రహించి వివేక్ను తొలగించాలనుకుంటున్నట్లు వార్తలు గట్టిగా వినిపించాయి. త్వరలో ఆయన బయటకు వస్తాడని తెలుస్తోంది. ఈలోగా మరో వార్త వినిపిస్తుంది. సంగీత దర్శకుడు థమన్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి వారితో జర్నీ చేస్తాడని తెలుస్తోంది. అక్కినేనిని వెండితెరకు పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య మనవాడే థమన్. తాత పేరుతో బ్యానర్ నిర్మించాలని గతంలో తెలిపారు. ఇదే నిజమైతే మరో కొత్త కలయిక తెలుగు సినిమా నిర్మాణంలోకి రానుంది.