బన్నీ - త్రివిక్రమ్ మూవీ ఏమైంది..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూవీ త్వరలోనే ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ... ఇప్పటివరకు అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. జనవరిలో ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే... తాజాగా బాగా ప్రచారంలో ఉన్న వార్త ఏంటంటే... బన్నీ - త్రివిక్రమ్ మూవీ ఆగిపోయిందని. అవును..ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఈ టాక్ బాగా వినిపిస్తోంది.
పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాడు. పరశురామ్ పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ బర్త్ డే విషేస్ తెలియచేస్తూ.. టాప్ స్టార్‌తో పరశురామ్ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేసింది. ఈ వార్త వెనక వాస్తవం ఏంటంటే... పరశురామ్ కథ రెడీ చేస్తుంది బన్నీ కోసమే అని అంటున్నారు గీతా ఆర్ట్స్ సన్నిహితులు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తపై బన్నీ స్పందిస్తాడేమో చూడాలి.