శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:59 IST)

బ‌న్నీ గారు.. మీకు ఏమైంది..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. శ‌ర్వానంద్ న‌టించిన ప‌డి ప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. టీజ‌ర్ & ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇదిలా ఉంటే... హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన బ‌న్నీ మాట్లాడుతూ.. శ‌ర్వానంద్‌ను శ‌ర్వానంద్ గారు అంటూ సంభోదించాడు.
 
స‌ర‌దాగా అలా పిలుస్తున్నాడ‌నుకుంటే.. ఎవ‌రైనా స‌రే ఎదుట వ్య‌క్తికి గౌర‌వం ఇవ్వాలి. టీవీ ఛాన‌ల్‌లో చూస్తుంటే.. ఓ కేసీఆర్.. అనో ఓ చంద్ర‌బాబు నాయుడు అనో సంభోదిస్తుంటారు. అలా అన‌డం క‌రెక్ట్ కాదు. కేసీఆర్ గారు.. చంద్ర‌బాబు నాయుడు గారు అనాలి. అందుక‌నే శ‌ర్వానంద్ నా క‌న్నా చిన్న‌వాడైనా స‌రే... శ‌ర్వానంద్ గారు అంటున్నాను అని చెప్పాడు. 
 
గ‌తంలో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా టైమ్‌లో రివ్యూ రైట‌ర్స్‌కి రివ్యూ ఎలా రాయ‌లో చెప్పాడు. ఇప్పుడేమో అంద‌ర్నీ గారు అని సంబోధించాలి అని లెసెన్ చెప్పాడు. ఈ రోజుల్లో ఎవ‌రు ఎవ‌రికి ఏం చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అంద‌రికీ అన్నీ తెలుసు. మ‌రి... ఈ విష‌యం బ‌న్నీ ఎప్పుడు తెలుసుకుంటాడో..?