బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 మే 2017 (16:45 IST)

కుంతలరాజ్యంలో బెడ్రూం ఫ్లాట్‌ కోసం గాలిస్తున్న బాలీవుడ్ హీరో ఎవరు?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి సృష్టించిన "బాహుబలి 2 ది కంక్లూజన్" దృశ్యకావ్యంలో కుంతల రాజ్యం వెలుగులోకి వచ్చింది. శ్వేతవర్ణం భవనాలు కలిగిన ఈ దేశంలో ఓ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం బాలీవుడ్ హీరో ఒకరు ముమ్మరంగా ప్ర

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి సృష్టించిన "బాహుబలి 2 ది కంక్లూజన్" దృశ్యకావ్యంలో కుంతల రాజ్యం వెలుగులోకి వచ్చింది. శ్వేతవర్ణం భవనాలు కలిగిన ఈ దేశంలో ఓ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం బాలీవుడ్ హీరో ఒకరు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రియల్ ఎస్టేట్ ఏజెంట్లను కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇదంతా నిజమని అనుకుంటున్నారా.. అంతా ఉత్తుత్తిదే. 
 
'బాహుబలి 2' చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తన స్పందనను తెలియజేస్తూ..."బాహుబలి-2ను ఇప్పుడు చూస్తున్నాను. విశ్రాంతి పడింది. సినిమా గురించి మళ్లీ మాట్లాడతాను. ఈ సినిమా ఎక్కడ షూట్ చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నా. అక్కడ నాకో 2 బెడ్ రూం ఫ్లాట్ కావాలి. ఎవరైనా ఏజంట్ ఉన్నారా?" అని ట్వీట్ చేశారు.
 
ఆపై రాత్రి సినిమా చూసిన తర్వాత ట్వీట్ పెడుతూ, భారత సినిమా రంగానికి పండగొచ్చిందని, ఈ సినిమా వసూళ్లను చేరేందుకు మిగతా హీరోలు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. కాగా, రిషి కపూర్ బ్యాడ్ లక్. ఆయన మనసు పారేసుకున్న కుంతల రాజ్యం మొత్తం వీఎఫ్ఎక్స్‌లో సృష్టించబడినదే కావడం గమనార్హం.