ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:03 IST)

వినయ్ రాయ్-విమలా రామన్‌ల పెళ్లి ఎప్పుడో?

Vinay_Vimala
Vinay_Vimala
నీ వల్లే నీ వల్లే నటుడు వినయ్ రాయ్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అతనితో జీవితాన్ని పంచుకోబోయేది మరెవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విమలారామన్‌. 
 
గత కొన్నేళ్లుగా ప్రేమాయణంలో ఉన్న ఈ ప్రేమ జంట తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
వినయ్ రాయ్, విమలా రామన్ పలు మార్లు జంటగా మీడియా కంట కూడా పడ్డారు. టూర్లు, వెకేషన్లు ఎక్కడికెళ్లినా జంటగానే వెళ్లారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కాగా వీరిద్దరూ త్వరలోనే ఏడడుగులు నడవనున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.
 
కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన విమలారామన్‌ తొలుత మలయాళం ఇండస్ట్రీలో హీరోయిన్‌‌గా కెరీర్ ఆరంభించింది. ఆతర్వాత తెలుగులో గాయం2, చట్టం, ఎవరైనా ఎపుడైనా, నువ్వానేనా, చుక్కల్లాంటి అబ్బాయి చక్కనైన అబ్బాయి తదితర చిత్రాలు చేసింది.