ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By xx
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (16:50 IST)

జగపతిబాబు, ప్రియమణిల "క్షేత్రం" షూటింగ్ పూర్తి!

జగపతిబాబు, ప్రియమణి, శ్యామ్‌, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం 'క్షేత్రం'. శ్రీబాలాజీ మూవీస్‌ పతాకంపై వై.ఎస్‌. ప్రతాప్‌రెడ్డి సమర్పణలో జి.గోవిందరాజు నిర్మించారు. నటుడు టి. వేణుగోపాల్‌ దర్శకుడిగా మారాడు. ఈ చిత్ర కథ నరసింహస్వామి దేవస్థానం నేపథ్యంలో రూపొందింది. ఇందులో ఐదు పాటలున్నాయి. వాటిని సుద్దాల అశోక్‌తేజ రాయగా, కోటి స్వరపరిచారు. 

షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నట్లు దర్శకుడు తెలియజేశారు. కాగా, శనివారం రాత్రి చిత్రం ఆడియో ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథి బెల్లంకొండ సురేష్‌ ఆడియోను ఆవిష్కరించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు.

నటుడిగా వేణు బాగా తెలుసు. ఓసారి వచ్చి సినిమా చేస్తున్నానని కథ వినిపించాడు. తనే రాసుకున్న ఆ కథకు జగపతిబాబు వేసిన పాత్రను అతనే వేస్తే బాగుంటుందని చెప్పాను. ఆయనే వేస్తున్నారని వేణు చెప్పాడు. ఎంతో అద్భుతమైన కథ ఇది. ఈ చిత్రం ద్వారా అంతరికీ మంచి పేరు రావాలకి కోరుకుంటున్నానని' పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

జగపతిబాబు మాట్లాడుతూ, ఈ చిత్రకథను దర్శకుడు ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు చెప్పారు. ఎంతో అద్భుతంగా అనిపించింది. అరుంధతి ప్యాట్రన్‌లో రూపొందే ఓ యదార్థగాథను తొలిసారైనా దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఇందులో ప్రియమణి పాత్ర కీలకం. మిగిలిన పాత్రలన్నీ అద్భుతంగా పండించారు. నేను ఖచ్చితంగా ఈ చిత్రంతో హిట్‌ కొడతానని నమ్మకముందని తెలిపారు.

కోటి మాట్లాడుతూ, పాటలు బాగున్నాయి. దానికంటేముందే కథ విన్నాను. కొన్ని నిముషాలతర్వాత ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందని దర్శకుడికి చెప్పాను. అంతలా ఆకట్టుకుంది. జగపతిబాబు కాంబినేషన్‌లో మంచి హిట్స్‌లో పనిచేశాను. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అద్భుతంగా ఇచ్చారని తెలిపారు.

ప్రియమణి మాట్లాడుతూ, ట్రైలర్స్‌ చూస్తుంటేనే ఎప్పుడు విడుదలవుతందా! అనే ఉత్సుకత కల్గింది. ఈ చిత్ర కథను గంటన్నరసేపు విన్నాను. విన్నవెంటనే చేస్తాననే హామీ ఇచ్చాను. జగపతిబాబులో 4వ సినిమాలో నటించానని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, ఈ కథకు తగినట్లుగా జగపతిబాబు, ప్రియమణి సరిపోయారు. వారి పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంది. మిగిలిన పాత్రలనీ బాగా చేశారు. కోటి సంగీతం, పరుచూరి బ్రదర్స్‌ సంబాషణలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అన్నారు.