సోమవారం, 17 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (16:00 IST)

దయగల వ్యక్తి అమీర్ ఖాన్.. అందుకే ప్రేమించాను : గౌరీ స్ప్రత్

Gauri Spratt
ఆరు పదుల వయసులో బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ బెంగుళూరుకు చెందిన గౌరీ స్ప్రత్ అనే ఓ బిడ్డ తల్లితో ప్రేమలో పడ్డారు. గత యేడాది కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. దీనిపై గౌరీ స్ప్రత్ స్పందించారు. 
 
అమీర్‌‍తో ఉన్న రిలేషన్‌పై గౌరీ స్ప్రత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆమె ఎలాంటి భాగస్వామి కావాలనుకుంది. అమీర్‌నే ఎందుకు ఎంచుకుంది అనే విషయాలను గౌరీ వెల్లడించారు. "దయగల వ్యక్తి. జెంటిల్‌మేన్. నా పట్ల శ్రద్ధగల వ్యక్తిని కోరుకున్నాను" అని చెప్పారు. ఈ విషయాలను అమీర్‌లో గుర్తించినట్టు పేర్కొన్నారు. 
 
అలాగే, అమీర్ కూడా మాట్లాడుతూ, నేను ప్రశాంతంగా ఉండగలిగే, నాకు శాంతిని ఇచ్చే వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఆమె గౌరీ అని అనిపించింది అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, గౌరీ స్ప్రంత్‌కు ఆరేళ్ల కుమార్ ఉన్నారు.