శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 8 డిశెంబరు 2018 (21:45 IST)

గజ తుఫాన్ బాధితులకు హీరో ఆది పినిశెట్టి సాయం

మొన్న తిత్లీ తుఫాన్.. నిన్న గజ తుఫాన్. దక్షిణ భారతదేశాన్ని ఈ తుఫాన్లు తుడిచి పెట్టేస్తున్నాయి. ఇప్పటికే తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును నీటిమయం చేసేసింది. ఇక ఎప్పటిలాగే గజ తుఫాన్ బాధితులకు మన సెలబ్రిటీలు పెద్దఎత్తున విరాళాలు అందిస్తుండగా.. ఇప్పుడు మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. 
 
హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్‌తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించారు.
 
ఆ ప్రాంతాలకు వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు ఇలా అవసరమైన వాటిని 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారివారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాకుండా... ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆది పినిశెట్టి కోరారు.