గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (11:41 IST)

హీరో నాగార్జున గోవా ప్రభుత్వం నోటీసులు... ఎందుకు?

nagarjuna
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగార్జున గోవా ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఉత్తర గోవాలో ఎంతో పేరుగాంచిన మాండ్రమ్ బీచ్ వద్ద హీరో నాగార్జున రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెట్టారు. ఇది చట్ట విరుద్ధమని పేర్కొంటూ గోవా పంచాయతీ రాజ్ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. రెసిడెన్షియల్ ప్రాజెక్టు పనులు తక్షణం నిలిపివేయకుంటే చర్యలు తప్పవని ఆ నోటీసులు పేర్కొన్నారు. 
 
ఉత్తర గోవాలో ఎంతో పాపులర్ అయిన మాండ్రమ్ విలేజ్‌లో నాగార్జున ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెట్టారు. ఈ నిర్మాణానికి నాగార్జున ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆ గ్రామ సర్పంచ్ అమిత్ సావంత్ ఆరోపించారు. వారి వద్ద అనుమతి ఉంటే కనుక దానిని చూపించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని కోరారు. 
 
ఆయన నటుడా? మరొకరా? అన్న సంగతి తమకు తెలియదని, అయితే తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాండ్రమ్ అనేది నార్త్ గోవాలో ఓ ప్రముఖమైన బీచ్. ఇక్కడి పర్యాటకులకు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది ప్రధాన బీచ్ హబ్‌గా ఉంది.