బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (14:44 IST)

దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన నటి

బాలీవుడ్ నటి శ్వేతా తివారి చిక్కుల్లో పడ్డారు. దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ నెటిజన్లు శ్వేతా తివారీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
బుధవారం భోపాల్‌లో చేసిన వ్యాఖ్యలే ఆమెను వివాదంలో చిక్కుకునేలా చేశాయి. 41 యేళ్ల ఈ బ్యూటీ తాను నటించిన ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సహ నటుడు రోహిత్ రాయ్‌తో కలిసి భోపాల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీంతో భోపాల్‌లోని శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషనులో శ్వేతా తివారిపై ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నేనే స్వయంగా విన్నానని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.