శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (10:19 IST)

ప్రీపెయిడ్ చార్జీల కాలపరిమితి 30 రోజులు ఉండాల్సిందే... ట్రాయ్

దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. అదేసమయంలో టెలికాం కంపెనీలకు తేరుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం ప్రీపెయిడ్ మొబైల్ కాలపరిమితి 28 రోజులుగా టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్నాయి. అయితే, ఇకపై ఈ కాలపరిమితిని 30 రోజులకు పెంచాలని, ఈ నిర్ణయాన్ని వచ్చే 60 రోజుల్లో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందుకోసం ప్రతి టెలికాం ఆపరేటర్ 30 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకుని రావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని కోరింది. తమ ఆదేశాలను రెండు నెలల్లో అమలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది.