శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:01 IST)

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్‌ సతీమణి ఇకలేరు..

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె... బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. పద్మావతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భార్యను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఉత్తేజ్‌కు పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.


ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.