శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (09:24 IST)

చెక్ బౌన్స్ కేసు: కోర్టుకు హాజరైన జీవితా రాజశేఖర్

Jeevitha
ప్ర‌ముఖ సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ చెక్ బౌన్స్ కేసులో గురువారం చిత్తూరు జిల్లా న‌గ‌రి కోర్టుకు హాజ‌ర‌య్యారు. త‌మ‌కు రూ.26 కోట్లు బ‌కాయి ప‌డ్డారంటూ ఆమెపై ఇటీవ‌ల జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. త‌మ వ‌ద్ద అప్పు తీసుకున్న జీవిత రుణాన్ని తిరిగి చెల్లించ‌లేద‌ని ఆరోపించింది. 
 
అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేయ‌గా... అది బౌన్స్ అయ్యిందని పేర్కొంది. ఈ వ్యవ‌హారంపై గ్రూప్ యాజ‌మాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు... జీవితా రాజ‌శేఖ‌ర్‌కు నోటీసులు జారీ చేసింది.
 
ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలోనే స్పందించిన జీవిత‌... జోస్ట‌ర్ గ్రూప్ త‌మ‌పై తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అయితే కోర్టుల‌పై త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని, కోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రు అవుతామ‌ని కూడా ఆమె తెలిపారు. 
 
ఈ  క్ర‌మంలో గురువారం జ‌రిగిన కోర్టు విచార‌ణ‌కు జీవిత స్వ‌యంగా హాజ‌ర‌య్యారు. త‌న న్యాయ‌వాదుల‌ను వెంట‌బెట్టుకుని ఆమె కోర్టుకు వ‌చ్చారు.