గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (09:38 IST)

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న మాలాశ్రీ కుమార్తె

Radhana
Radhana
టాలీవుడ్‌లో సీనియర్ నటి కూతురు ఎంట్రీ ఇవ్వనుంది. వారసుడొచ్చాడు, ఊర్మిళ, బావ బామ్మర్ది.. లాంటి ఎన్నో తెలుగు, కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మాలాశ్రీ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. తాజాగా మాలాశ్రీ కూతురు రాధన హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. 
 
కన్నడ హీరో దర్శన్‌ 56వ సినిమాలో రాధన హీరోయిన్‌‌గా నటించబోతోంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించబోతున్నారు. 
 
ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం నాడు బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు.