బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:45 IST)

పూజా హెగ్డే డ్యాన్స్ అదిరిందిగా.. ఎక్కడో తెలుసా? (video)

Pooja Hegde
ప్రముఖ సౌత్ నటి పూజా హెగ్డే తన సోదరుడి సంగీత్‌లో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పూజా హెగ్డే డ్యాన్స్ స్టెప్పులకు నెటిజన్లు, అభిమానుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే ఇటీవలే శివానితో వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమకాలీన- సాంప్రదాయ దుస్తుల కలయికతో అందరి దృష్టిని ఆకర్షించింది.
 
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది, దీనిలో ఆమె తన కుటుంబ సభ్యులతో వేదికపై డ్యాన్స్ చేస్తూ, వైలెట్-హ్యూడ్ లెహంగాలో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.