శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (15:23 IST)

నటనకు బ్రేక్ చెప్పిన పెళ్లి సందD హీరోయిన్-ఎందుకో తెలుసా?

SriLeela
పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల నటనకు బ్రేక్ చెప్పేసింది. దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలైన పెళ్లి సందడితో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ చేసింది. తన నటన, అభినయంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించగా, ఈ చిత్రాన్ని కె రాఘవేంద్రరావు నిర్మించారు. అయితే తన చదువు కోసం నటనకు శ్రీలీల దూరమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
 
తొలి సినిమాతో అదరగొట్టిన శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకు పోతున్నప్పటికీ, నటనకు కొంత బ్రేక్ ఇచ్చి తన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలపై దృష్టి సారించింది. పెళ్లి సందడి విడుదలైన వెంటనే ఆమె సినిమాను ప్రమోట్ చేసి, పరీక్షలు రాయడానికి ముంబైకి వెళ్లింది. 
 
మరికొద్ది రోజుల్లో పరీక్షలు ముగించుకుని మళ్లీ తన నటనను ప్రారంభించనుంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం, శ్రీలీల తన తదుపరి చిత్రానికి సత్యదేవ్‌తో ఇప్పటికే సంతకం చేసింది. అలాగే కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు కూడా ఈ యంగ్ హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నాయి.