వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసిన అడివిశేష్
ప్రభుత్వాలు పట్టించుకోకపోతే సామాజిక స్పుహ వున్నవారు ఏదో ఒక మంచి చేస్తూనే వుంటారు. అలాంటిదే హీరో అడవిశేష్ చేసిన పని..హైదరాబాద్‌లోని కోఠీ ప్రభుత్వ హాస్పిటల్‌లో దాదాపు 300 కొవిడ్ పేషెంట్స్ చికిత్స పొందుతుండగా అక్కడ పేషంట్స్‌తో పాటు సిబ్బందికి తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే 865 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు అడివిశేష్.
అలానే ఆ హాస్పిటల్ అవసరాలకు సరిపడ త్రాగునీటిని సరఫరా చేసేందుకు తన సొంత ఖర్చుతో కోఠీ ప్రభుత్వ హాస్పటల్‌లో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ గంటకు వెయ్యిలీటర్ల నీటిని హాస్పిటల్ అవసరాల కోసం అందిస్తుంది.
సాధారణంగా సెలబ్రిటీలు ఒక సమస్యకు తాత్కాలిక పరిష్కారాన్ని చూపడం మనం చూస్తుంటాం కానీ..అడివిశేష్ ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం గొప్ప విషయం. సమయానికి కరోనా బాధితులను ఆదు