బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (11:49 IST)

అకీరా నందన్‌ను నచ్చిన హీరో ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు అడవి శేషు అంటే బాగా ఇష్టమట. తనని ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడట. మాతృ దినోత్సవంను పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 
 
అకీరాకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పాలని నెటిజన్ అడగగా.. దానికి సమాధానంగా రేణు యంగ్ హీరో అడివి శేష్.. అకీరా ఫేవరేట్ హీరో అని చెప్పింది.
 
ఎవరు సినిమా చూసిన తరువాత అకీరా హీరో అడివి శేష్‌కి ఫ్యాన్ అయిపోయాడని రేణూ చెప్పింది. ఇకపోతే.. అడివి శేషు ఓ రోజు రేణు దేశాయ్ ఫ్యామిలీని కలవడం జరిగింది. టీనేజ్ కూడా దాటని అకీరా 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నాడని ట్వీట్ చేశాడు కూడా. 
 
ఇంకా రేణు తన పిల్లలు అకీరా, ఆద్య గురించి మాట్లాడుతూ.. తమ పిల్లల్ని ఎప్పుడూ కొట్టలేదని... కాకపోతే ఏదైనా పని చేయకపోయినా... మాట వినకపోయినా గట్టిగా మందలిస్తానని తెలిపింది.